రుణాల ఎగవేత వ్యవహారం.. వైసీపీ ఎమ్మెల్యే ఆస్తులు వేలం వేయనున్న కెనరా బ్యాంకు..

By Asianet News  |  First Published Jul 21, 2023, 9:03 AM IST

రుణాల ఎగవేత వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య, తండ్రి డైరెక్టర్లుగా ఉన్న మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన ఆస్తులు కెనరా బ్యాంకు వేలం వేయనుంది. ఆ కంపెనీకి ఎమ్మెల్యే హామీదారుగా ఉన్నారు. 


రుణాల ఎగవేత వ్యవహారంలో శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యుడు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను కెనరా బ్యాంకు వేలం వేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. మెసర్స్‌ సాయిసుధీర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంది. వాటిని సకాలంలో చెల్లించలేదు.

సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సినీ నటికి ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్ ఆఫర్.. హోటల్ కు వెళ్లగానే అత్యాచారం..

Latest Videos

అయితే ఆ కంపెనీకి శాసన సభ్యుడు శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు హామీదారైన శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18వ తేదీన వేలం వేస్తున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. గతంలో మెసర్స్‌ ఏఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌గా పేరు ఉన్న ఆ కంపెనీకి శ్రీధర్ రెడ్డి భార్య అయిన అపర్ణరెడ్డి, అలాగే ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు.

జిమ్ లో ట్రెడ్ మిల్ పై పరుగెత్తుతుండగా కరెంట్ షాక్.. యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

కాగా ఆ కంపెనీ తీసుకున్న లోన్ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.908 కోట్లు అయ్యాయి. వాటిని చెల్లించకపోవడంతో ఆ కంపెనీ, అలాగే హామీదారు ఆస్తులను వేలం వేయాల్సి వస్తోందని కెనరా బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. కాగా.. ఈ కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!