మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Published : Apr 16, 2021, 07:25 AM IST
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

సారాంశం

సుబ్బరాజు భౌతిక కాయాన్ని మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు(66) మృతి చెందారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు స్వయంగా తెలిపారు.

సుబ్బరాజు భౌతిక కాయాన్ని మార్చురీలో భద్రపరిచారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. కాగా... ఆయన మృతి పట్ల అభిమానులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu