ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

By Nagaraju penumala  |  First Published Oct 18, 2019, 5:16 PM IST

తన ఆస్తుల కేసుకు సంబంధించి ఆరేళ్లుగా విచారణ జరుగుతుందని జగన్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో ఏనాడైనా ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా అని జగన్ సీబీఐ కోర్టును నిలదీశారు. వ్యక్తిగత హాజరుమినహాయింపుపై సీబీఐ కోర్టు మరోసారి పునరాలోచించాలని కోరారు. 
 


 హైదరాబాద్: ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సీబీఐ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగత హాజరు పిటీషన్ పై శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల పాలనను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్న నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని సీఎం జగన్ గతంలో సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

జగన్ పిటీషన్ పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ తరపు న్యాయవాది. కౌంటర్ దాఖలు చేసే సమయంలో సీబీఐ వాడిన బాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఊహాగానాల ఆరోపణలతో పిటీషన్ కు సంబంధం లేని అంశాలను సీబీఐ తన కౌంటర్ లో ప్రస్తావించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు సీబీఐ కోర్టులో స్పష్టం చేశారు. 
 
జగన్ హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలని కోరారు. గత ఆరేళ్లలో ఏనాడు కేసుల వాయిదాలు కూడా కోరలేదని కనీసం స్టే కూడా అడగలేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 

గతంలో ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వ్యక్తిగత హాజరుపై హైకోర్టును ఆశ్రయించామని అయితే రాజకీయ అవసరాల కోసం హైకోర్టు ఆనాడు అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు అని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న నేపథ్యంలో ప్రజా పరిపాలన దృష్ట్యాకాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని అందువల్లే మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు. 

తన ఆస్తుల కేసుకు సంబంధించి ఆరేళ్లుగా విచారణ జరుగుతుందని జగన్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో ఏనాడైనా ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా అని జగన్ సీబీఐ కోర్టును నిలదీశారు. వ్యక్తిగత హాజరుమినహాయింపుపై సీబీఐ కోర్టు మరోసారి పునరాలోచించాలని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికయ్యారని ఆ ముఖ్యమంత్రి హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది ఆరోపించారు. గతంలో ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకునే హైకోర్టు, సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. 

జగన్ కు అవసరం ఉన్నప్పుడు పిటీషన్ వేసి ఆ ఒక్కరోజు విచారణకు  మినహాయింపు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దంటూ న్యాయస్థానాన్ని సీబీఐ తరపు న్యాయవాది గట్టిగా కోరారు. ఇరువాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. 

తాను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని అధికారిక పనుల్లో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సెప్టెంబర్ 20న జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన తరఫున కోర్టుకు న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తన పిటీషన్ లో కోరారు.

ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలు చూడాలని, ఎక్కువ సమయం అధికారిక విధులకు కేటాయించవలసిన కారణంగా వ్యక్తిగత హాజరు కాలేరని జగన్ తరపు న్యాయవాది వాదించిన సంగతి తెలిసిందే.  

click me!