రాజధానిగా అమరావతి డౌటే, సాకులు చెప్తున్న ప్రభుత్వం: బొత్స సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 18, 2019, 2:50 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనే దానిపై నిపుణుల కమిటీని నియమించామంటూ బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుందని తెలిపారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే దానిపై ఇంకా సందేహాలు నెలకొన్నాయి. గతంలో రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసి ప్రజలను గందరగోళంలోకి నెట్టేసిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలు మరవకముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనే దానిపై నిపుణుల కమిటీని నియమించామంటూ బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి నివేదిక ఇవ్వనుందని తెలిపారు. 

అధ్యయన కమిటీ సూచనలు, సిఫార్సులపై మంత్రి వర్గంలో చర్కచించి ప్రజాభిప్రాయసేకరణ చేపట్టి అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. బొత్స చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళంలోకి నెట్టేసినట్లు ఉన్నాయి. ఇంతకీ రాజధాని మఅరావతిలో ఉన్నట్లా లేక లేనట్లా అన్న సందేహం మళ్లీ ప్రజల్లో నెలకొనేలా వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కొందరు అమరావతిలోనే కొనసాగించాలని మరికొందరు అలాగే ఉత్తరాంధ్రలో పెట్టాలని ఇంకొందరు ఇలా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధ్యయన కమిటీ ప్రాంతాల వారీగా వారి అభిప్రాయాలను కూడా పరిశీలనలో తీసుకోనున్నట్లు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

అంతేకాదు రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదించిందని కానీ దాన్ని ఆనాటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. 

అధ్యయన కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా ఆనాడు మంత్రిగా పనిచేసిన నారాయణ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఆధారంగా చేసుకుని రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం రాజధానిగా ఉన్న ప్రాంతంలో కొద్దిపాటి వర్షం పడితేనే ముంపునకు గురవుతుందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఒక భవనం నిర్మించాలంటే 100 అడుగుల లోతులో పునాదులు తీయాల్సి వస్తోందని ఫలితంగా ఖర్చు చాలా ఎక్కువగా అవుతుందని తెలిపారు. 

అందువల్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అవినీతి కూడా చోటు చేసుకుందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలెత్తే ఇబ్బందులపైనా అధ్యయన కమిటీ చర్చించనున్నట్లు తెలిపారు. 

రాజధాని ప్రాంతంలో పనులు ఆపేశారంటూ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఆపేసిన పనుల్లో అవసరమైన వాటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. అవసరం లేవని వాటి పనులు నిలిపివేశామని అందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. 

గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ వ్యయం అధికాంగా ఉందన్నారు. అందుకే పునాది దశలో ఉన్న 50వేల ఇళ్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

మెుత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే రాజధానిపై ఏపీలో రచ్చరచ్చ జరుగుతుంది. అమరావతిలోనే రాజధానిని ఉంచాలని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. అంతేకాదు రాజధానిని తరలిస్తే ఒప్పుకోమని రైతులు కూడా ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ తాజాగా బొత్స చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లు అయ్యింది. 


click me!