విజయసాయి బెయిల్ రద్దుకు రఘురామ పిటిషన్... సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు

Arun Kumar P   | Asianet News
Published : Aug 10, 2021, 12:47 PM ISTUpdated : Aug 10, 2021, 12:56 PM IST
విజయసాయి బెయిల్ రద్దుకు రఘురామ పిటిషన్... సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు

సారాంశం

వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తోటి ఎంపీ విజయసాయి రెడ్డి బెెయిల్ ను రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్ధానం విచారణ జరిపింది. 

హైదరాబాద్: అధికార వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తోటి ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని విజయ్ సాయిరెడ్డిని ఆదేశించింది న్యాయస్థానం. కౌంటర్ దాఖలుకు గడువు కోరడంతో విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇప్పటికే సిబిఐ కోర్టు నోటీసులు జారీచేసింది. విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. 

read more  జగన్ అక్రమాస్తుల కేసు: కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ.. విచారణ వాయిదా

విజయసాయి రెడ్డి బెయిలును రద్దు చేయాలని దాఖలైన ఆ పిటిషన్ పై రెండురోజుల క్రితమే విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇవాళ మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు సమయం కోరడంతో మరో మూడురోజుల సమయమిచ్చింది. విచారణను 13కి వాయిదా వేసింది. 

సిబిఐ కేసుల్లో సాక్షులుగా ఉన్నవారిలో విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా భయాందోళనలు కలిగిస్తూ ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. విచారణకు సహకరిస్తామని చెప్పి కూడా ఏడాదిగా కోర్టు విచారణకు హాజరు కావడం లేదని, బెయిలు షరతులను ఉల్లంఘించారని రఘురామ కృష్ణం రాజు తన పిటిషన్ లో ఆరోపించారు. 

తనపై నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి కీలకమైన పదవులను ఇచ్చే విధంగా జగన్ ను ప్రభావితం చేశారని, దాంతో సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ ప్రతివాదిగా ఉన్న విజయ సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది.
 


 

PREV
click me!

Recommended Stories

ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం | Blessings for Newlywed Couple | YSRCP | Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: రూ.6వేల కోట్ల‌తో కొత్త స‌బ్ స్టేష‌న్లలు | Asianet News Telugu