నాపై పోటీ చేయి, ఓడిపోతే హిందూపురం వదిలివెళ్తా: బాలయ్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్

Published : Sep 23, 2021, 09:32 AM IST
నాపై పోటీ చేయి, ఓడిపోతే హిందూపురం వదిలివెళ్తా: బాలయ్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్

సారాంశం

రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని  వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ బాలకృష్ణకు సవాల్ విసిరారు. తాను ఓటమి పాలైతే హిందూపురం వదిలి వెళ్లిపోతానని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఫల్యాలపై టీడీపీ ఆత్మ విమర్శ చేసుకోకుండా  ప్రత్యర్ధులపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.  

హిందూపురం: బాలకృష్ణ(balakrishna)  హిందూపురం (hindpur)ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పాటీపడాలని ఎమ్మెల్సీ,వైసీపీ హిందూపురం ఇంచార్జీ ఇక్బాల్(Iqbal) సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే హిందూపురం వదిలి వెళ్లిపోతానని ఇక్బాల్ చెప్పారు.

బుధవారం నాడు ఇక్బాల్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని బాలకృష్ణకు ఇక్బాల్ సవాల్ విసిరారు.  వరుస ఓటములతో టీడీపీ కుదేలవుతుండడంతో ప్రజల్లో అభాసుపాలౌతోందన్నారు.  ఈ భయంతోనే  పరిషత్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఇక్బాల్ విమర్శించారు.  

కుప్పం, హిందూపురం  సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైనా కూడ ఎందుకు ఓటమి పాలైందనే విషయమై ఆత్మవిమర్శ చేసుకోకుండా సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్ధులకు అందనంత దూరంలో విజయాలను నమోదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!