జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషన్: కౌంటర్‌కి సమయం కోరిన ఏపీ సీఎం

Published : May 07, 2021, 02:52 PM IST
జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషన్: కౌంటర్‌కి సమయం కోరిన ఏపీ సీఎం

సారాంశం

ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు  శుక్రవారంనాడు విచారణ చేపట్టింది.

హైదరాబాద్: ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు  శుక్రవారంనాడు విచారణ చేపట్టింది.ఈ విషయమై  కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని వైఎస్ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు  కోర్టును కోరారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

also read:బ్రేకింగ్: బెయిల్ రద్దు పిటిషన్... జగన్ కు సిబిఐ కోర్టు నోటీసులు

 ఈ కారణంగా బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.గత ఎన్నికల్లో వైసీపీ నుండి నర్సాపురం నుండి రఘురామకృష్ణం రాజు పోటీ చేశారు. అయితే గత ఏడాదిలో  పార్టీ వ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడుతున్నందున రఘురామకృష్ణంరాజుపై వైసీపీ వేటేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కూడ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 27న ఏపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!