సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ తెచ్చిన జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.
అమరావతి: సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ తెచ్చిన జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. సంగం డెయిరీ చైర్మెన్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన తర్వాత ఈ డెయిరీని డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన జీవోను జారీ చేసింది.
ఈ డెయిరీ కార్యకలాపాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను సంగం డెయిరీ డైరెక్టర్లు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ డెయిరీకి చెందిన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా తమ అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ తెచ్చిన జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. pic.twitter.com/sfJWdDUOBf
— Asianetnews Telugu (@AsianetNewsTL)సంగం డెయిరీ ఛైర్మెన్ దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ కస్టడీలో ఉన్నాడు. అయితే ఆరోగ్యం సరిగా లేనందున ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంగం డెయిరీ ఛైర్మెన్ నియమనిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడనే ఆరోపణలతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది.
also read:ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్: ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
సంగం డెయిరీ ఛైర్మెన్, ఎండీ అరెస్ట్ చేసినందున రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూసేందుకు గాను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే డెయారీ కార్యకలాపాలను తాము చూసుకొంటామని డెయిరీ డైరెక్టర్లు చెబుతున్నారు.