జగన్‌కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ కోర్ట్.. రఘురామ హ్యాపీ

By Siva KodatiFirst Published Apr 27, 2021, 3:05 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.  

నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ వెల్లడించారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో న్యాయస్థానం స్వీకరించినట్లు నర్సాపురం ఎంపీ వివరించారు.

దీని ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు ఇస్తుందని రఘురామ పేర్కొన్నారు.  ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.  

Also Read:జగన్‌కు షాక్.. ఆయన బెయిల్ రద్దు చేయండి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజు పిటిషన్

అంతకుముందు సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు ఎంపీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకోవాలని, జయలలిత, లాలూ తదితరులు తమ స్థానంలో వేరే వారికి సీఎంగా ఛాన్స్ ఇచ్చినట్టే జగన్ కూడా వేరొకరికి అవకాశమిచ్చి.. కేసుల నుంచి బయటపడాలని ఎంపీ హితవు పలికారు. 

click me!