వెంకటరమణ ఫిర్యాదు: డాక్టర్ సుధాకర్ మీద 3 సెక్షన్ల కింద సిబిఐ కేసు

By telugu teamFirst Published Jun 4, 2020, 8:27 AM IST
Highlights

నర్సీపట్నానికి చెందిన వైద్యుడు డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుధాకర్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది.

విశాఖపట్నం: హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదును ఆధారం చేసుకుని సిబిఐ అధికారులు డాక్టర్ సుధాకర్ మీద కేసులు నమోదు చేశారు. డాక్టర్ సుధాకర్ మీద సిబిఐ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు సుధాకర్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది. 

కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని సిబిఐ తన వెబ్ సైట్ లో బుధావరం పొందుపరిచింది. గత నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు తన విధులకు ఆటంకం కలిగించారని విశాఖపట్నం ఫోర్త్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. 

వెంకటరమణ ఫిర్యాదు మేరకు సుధాకర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిబిఐ ఇన్ స్పెక్టర్ ఎన్. రాఘవేంద్ర కుమార్ ఎఫ్ఐర్ కాపిలో చెప్పారు. ఘటన జరిగిన రోజునే హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ సుధాకర్ మీద ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దాంతో డాక్టర్ సుధాకర్ మీద ఐపిసీ 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 427 (తుంటరి చేష్టలతో న్యూసెన్స్ సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం), 506 (ఎదుటి వ్యక్తులను నేరపూరితంగా బెదిరిస్తూ భయోత్పాతం సృష్టించడం) తదితర సెక్షన్ల కింద సుధాకర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో స్పష్టం చేసింది.

16వ తేదీన తాటిచెట్లపాలెం కూడలి వద్ద విధుల్లో ఉండగా పోర్టు ఆస్పత్రి ఒకరు ట్రాఫిక్ కు చిక్కులు సృష్టిస్తూ, స్థానికులను ఇబ్బంది పెడుతున్టన్లు పోలీసు కంట్రోల్ రూం నుంచి రహదారి భద్రత వాహనానికి సమాచారం వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ డాక్టర్ సుధాకర్ అహంకారంతో మాట్లాడుతూ పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నించి, వారి విధులకు అడ్డుపడ్డారని వెంకటరమణ ఫిర్యాదు చేశారు. 

ఓ హోంగార్డు మొబైల్ లాక్కుని బద్దలు కొట్టారని, రోడ్డుపై వెళ్తున్నవారు చెప్పినా వినకుం్డా వారిని తిట్టారని, చొక్కా విప్పేసి స్థానికులపై దాడికి ప్రయత్నించారని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చిన సుధాకర్ ను, ఆయన కారును పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లారని ఆయన తన ఫిర్యాదు వివరించారు. 

ఇదిలావుంటే, సుధాకర్ పట్ల పోలీసులు, ఇతరులు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల నిజానిజాలను తెలుసుకోవడానికి సీబిఐ అధికారులు సాక్ష్యాల కోసం అన్వేషిస్తున్నిారు. నిఘా కెమెరాల ఫుటేజీని సేకరించారు. మీడియా చానెళ్లలో ప్రసారమైన వీడియోలను సేకరిస్తున్నారు. విచారణను సిబిఐ అధికారులు గోప్యంగా సాగిస్తున్నారు.

click me!