ఇళ్ల పట్టా కావాలంటే... మహిళలు వారి దాహాన్ని తీర్చాల్సిందే: లోకేశ్ సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Jun 03, 2020, 11:50 PM IST
ఇళ్ల పట్టా కావాలంటే... మహిళలు వారి దాహాన్ని తీర్చాల్సిందే: లోకేశ్ సీరియస్

సారాంశం

నిరుపేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసిపి ప్రభత్వం భారీ అవినీతికి తెరతీసిందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 

గుంటూరు: నిరుపేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసిపి ప్రభత్వం భారీ అవినీతికి తెరతీసిందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇళ్ల పట్టాల కోసం వైసిపి నాయకులు నిరుపేదలను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని... దీంతో మహిళలు మెడలోని పుస్తెలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగానే ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటున్న జగన్ కు ఇవన్నీ కనిపించడం లేదా అని నిలదీశారు. 

''ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల డబుల్ దోపిడీ.పేదల రక్తం తాగుతున్న వైకాపా నేతల భూదందాని కళ్ళకు కట్టింది 10 టీవీ స్టింగ్ ఆపరేషన్. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ కొన్ని చోట్ల  7 లక్షలు కూడా విలువ చెయ్యని భూమిని 45 లక్షలకు కొని భారీ అవినీతికి తెరలేపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల ప్రజా ధనాన్ని కొట్టేసారు'' అని ఆరోపించారు.

''అక్కడితో వైకాపా నేతల ధన దాహం తీరలేదు ఇప్పుడు పట్టా కావాలంటే క్యాష్ కొట్టాల్సిందే అంటూ లబ్ధిదారులను వేధిస్తున్నారు. మహిళలు పుస్తెలు అమ్మి వైకాపా అవినీతి దాహాన్ని తీర్చే పరిస్థితి. పట్టాకి 20 వేల నుండి లక్షన్నర వసూలు చేస్తున్నారు అంటే ఎంత దారునమైన పరిస్థితి ఉందో అర్థం అవుతుంది'' అన్నారు.

read more  స్నానం చేసే మహిళల వీడియోలు తీసి వేధింపులు...: వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
 
''ఈ రేంజ్లో జే టాక్స్ వసూలు చేస్తుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ లెక్చర్ ఇస్తున్నారు వైఎస్ జగన్ గారు. ఇళ్ల స్థలాల స్కామ్ పై విచారణ జరిపితే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటకు వస్తాయి'' అంటూ సోషల్ మీడియా వేదికన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు నారా లోకేశ్. 

''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రేమతో ప్రజలపై ముద్దులు విసిరిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకా జనం పై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. జ‌నం పై జ‌గ‌న్‌ది స‌వ‌తిత‌ల్లి ప్రేమని తేలిపోయింది'' అని ఎద్దేవా చేశారు. 

''పెంచుకుంటూ పోతానంటే...పెన్ష‌న్ల‌నుకున్న ప్ర‌జ‌ల‌కు షాక్ కొట్టేలా క‌రెంటు బిల్లులు,ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. జ‌గ‌న్ దూకుడుతో జ‌నాన్ని బాదుడే బాదుడు. ఇసుక‌, లిక్క‌ర్ మాఫియాల‌పై వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలు మండిప‌డుతున్నారంటే పాల‌న ఎంత ఘోరంగా ఉందో అర్థ‌మ‌వుతోంది'' అంటూ నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. 

   
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu