ఏపీలో సీబీఐ, ఏసీబీల మధ్య రగడ

By ramya neerukondaFirst Published Dec 1, 2018, 12:19 PM IST
Highlights

లంచం డిమాండ్‌ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం వివాదాస్పదమైంది. 

ఏపీలో సీబీఐ, ఏసీబీల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరుకుంది. లంచం డిమాండ్‌ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం వివాదాస్పదమైంది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో సీబీఐ నేరుగా దర్యాప్తు జరిపేందుకు అనుమతి రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  కాగా.. ఇటీవల కృష్ణా జిల్లాకృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కేంద్ర సీజీఎస్టీ రేంజ్‌ అధికారి ముక్కు కాళీ రమణేశ్వర్‌ లంచం డిమాండ్ చేస్తున్న విషయం ముందుకుగా సీబీఐ అధికారులకు తెలిసింది.

సీబీఐ దాడులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. వారు పట్టించుకోలేదు. పోగా.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. దీంతో.. వారు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ కేసు నమోదు చేయడం ఇప్పుడు సీబీఐ, ఏసీబీలలో తీవ్ర దుమారం రేపుతోంది. 

కాగా, దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ వ్యవహరించిన తీరును సీబీఐ శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టింది. పరస్పర సహకారం లేకపోతే వ్యవస్థలోని అవినీతిని అరికట్టలేమని పేర్కొంది. ఫిర్యాదు తమకే నేరుగా వచ్చినట్లు ఏసీబీ ప్రకటించడంపై కూడా సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

click me!