ఏపీ మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ కేసు

By Siva KodatiFirst Published Mar 5, 2021, 9:38 PM IST
Highlights

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరంలోని 10వ వార్డు పరిధిలో శ్రీరామ్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   
 
నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ అక్కడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి నాగవల్లి ధర్మవరం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పరిటాల శ్రీరామ్‌ సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

కాగా ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. 

click me!