విశాఖ: చంద్రబాబుతో గంటా భేటీ, బుజ్జగించేందుకేనా..?

Siva Kodati |  
Published : Mar 05, 2021, 08:16 PM ISTUpdated : Mar 05, 2021, 08:17 PM IST
విశాఖ: చంద్రబాబుతో గంటా భేటీ, బుజ్జగించేందుకేనా..?

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం విశాఖ వచ్చిన చంద్రబాబును గంటా కలిశారు. 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం విశాఖ వచ్చిన చంద్రబాబును గంటా కలిశారు.

కొద్దిరోజుల కిందట ఆయన వైసీపీలోకి వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డే ఈ విషయం స్వయంగా చెప్పడంతో శ్రీనివాసరావు పార్టీ మార్పు ఖాయమనుకున్నారు.

అయితే తాను టీడీపీని వీడేది లేదని.. అలాంటి ఆలోచన వుంటే ధైర్యంగా చెప్పి చేస్తానని గంటా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Also Read:100 సార్లు ఇదే ప్రచారం.. విజయసాయి రెడ్డికి గంటా శ్రీనివాస రావు కౌంటర్

అంతకుముందు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్ధిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానని తెలిపారు.

హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు విశాఖలోనే 10 రోజులు ఉన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నగరంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాకే తిరిగి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. 

జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో పీలా శ్రీనివాస్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ఆయన ప్రజలను కోరారు.  

పోలవరం ద్వారా విశాఖకు నీటిని తీసుకురావాలని భావించానని చెప్పారు. వీలైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు పోలవరం పనులు జరగడం లేదన్నారు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu
నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu