పెరుగుతున్న కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం... ఏపీలో 8,90,441కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Mar 05, 2021, 07:55 PM IST
పెరుగుతున్న కరోనా కేసులు, చిత్తూరులో అత్యధికం... ఏపీలో 8,90,441కి చేరిన సంఖ్య

సారాంశం

గత కొన్ని రోజులుగా ఏపీలో నిలకడగా వున్న కరోనా  కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,90,441కి చేరుకుంది.

గత కొన్ని రోజులుగా ఏపీలో నిలకడగా వున్న కరోనా  కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 124 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 8,90,441కి చేరుకుంది. కరోనా వల్ల నిన్న అనంతపురంలో ఒకరు మరణించారు. దీనితో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,172కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 900 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 94 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనిలో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,82,369కి చేరుకుంది. ని

న్న ఒక్క రోజు రాష్ట్రంలో 51,660 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 1,41,43,911కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 10, చిత్తూరు 30, తూర్పు గోదావరి 13, గుంటూరు 16, కడప 4, కృష్ణా 18, కర్నూలు 4, నెల్లూరు 6, ప్రకాశం 0, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 13, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu