నకిలీ పత్రాలతో ఎస్సై కొలువు.. బైటపడ్డ పోలీసు భాగోతం..

By AN TeluguFirst Published Oct 7, 2020, 1:38 PM IST
Highlights

గుంటూరులో నకిలీ ధ్రువపత్రాలతో పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాడో ఎస్సై. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అటాచ్మెంట్ ఎస్ ఐగా విధులు నిర్వర్తిస్తున్న గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఏలూరు రేంజి అధికారులు కేసు నమోదు చేశారు. 

గుంటూరులో నకిలీ ధ్రువపత్రాలతో పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాడో ఎస్సై. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అటాచ్మెంట్ ఎస్ ఐగా విధులు నిర్వర్తిస్తున్న గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఏలూరు రేంజి అధికారులు కేసు నమోదు చేశారు. 

మొదట అగ్నిమాపక శాఖలో పనిచేసిన ప్రభాక రెడ్డి 2011 ఎస్ఐ రిక్రూట్మెంట్ లో పాల్గొని ఎస్సైగా అర్హత సాధించాడు. తన అర్హతకు సంబంధించినధ్రువపత్రాలను ఏలూరు రేంజి ఐజీ కార్యాలయంలో అందజేశాడు. అయితే రిక్రూట్మెంట్ టైంకి రెండేళ్లు ఎక్కుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి, ఆ రెండేళ్లు తాను ఎన్సీసీలో ఇన్స్ పెక్టర్ గా పనిచేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించాడు. 


ఎన్సీసీ ఇన్స్ పెక్టర్ కు రిక్రూట్ మెంట్ లో మూడేళ్ల వయసు సడ లింపు ఉంటుంది. దీంతో 2014లో ఎస్ ఐ గా పోస్టింగ్ సాధించాడు ప్రభాకర్ రెడ్డి. అయితే విధుల్లో చేరిన మొదటి నుంచీ ప్రభాకర్ రెడ్డి ఏదో రకంగా వివాదాల్లో ఉంటుండే వాడు. ప్రకాశం జిల్లా కొమరోలులో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఎంపీడీవో తో గొడవ జరిగింది. 

ఈ క్రమంలో ఎస్సై తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్న తాధికారులు మార్కాపురం డీఎస్పీకి విషయం విచా రించాలని అప్పజెప్పారు.దీంతో నకిలీ ధ్రువపత్రాల విషయం బైట పడింది. నకిలీ పత్రాలు సమర్పించిన విషయం వాస్త వమేనని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. 

click me!