గాజువాకలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం... నిజనిర్దారణ కమిటీ ఏర్పాటు

By Arun Kumar PFirst Published Oct 7, 2020, 1:12 PM IST
Highlights

గాజువాక అత్యాచార దుర్ఘటనలో నిందితులను రక్షించేందుకు వైకాపా నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని కళా మండిపడ్డారు. 

విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాజువాకలో అత్యాచార ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్నాటు చేసినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు వెల్లడించారు. ఈ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులుగా వంగలపూడి అనిత, పుచ్చా విజయకుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవిందులను నియమించినట్లు వెల్లడించారు. 

అత్యాచార సంఘటనలో నిందితులను రక్షించేందుకు వైకాపా నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని కళా మండిపడ్డారు. అత్యాచార సంఘటనలపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తుంటే వైసిపి నేతలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అరాచక పాలనకు ఆంధ్రప్రదేశ్ ను అడ్డాగా మర్చారని వెంకట్రావు మండిపడ్డారు. 

read more   టిక్ టాక్ లో ప్రేమ.. మోసం చేసిన ప్రేమికుడు.. ఆమెకిది రెండోసారి..

''దిశా చట్టం క్రింద ఎంతమందిని శిక్షించారు.  దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మహిళలపై దాడులు దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నాయి. 29.3 శాతం పైగా నేరాలు ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు కళా వెంకట్రావు. 


 

click me!