మహిళతో అసభ్య ప్రవర్తన .. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడిపై కేసు

Siva Kodati |  
Published : Aug 09, 2022, 03:25 PM IST
మహిళతో అసభ్య ప్రవర్తన .. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడిపై కేసు

సారాంశం

మహిళతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోరుకొండ మండలం గుడాల గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సీనియర్ రాజకీయ వేత్త, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ వివాదంలో ఇరుక్కున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో శ్రీరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కోరుకొండ మండలం గుడాల గ్రామానికి చెందిన మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 509, 354 కింద కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu