ప్రధాని మోదీపై అంతులేని అభిమానం.. ఏపీ నుంచి పాదయాత్రగా ఢిల్లీకి..

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 2:18 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ‌పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి  ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు నాటికి ఢిల్లీ చేరుకుని.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ‌పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి  ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు నాటికి ఢిల్లీ చేరుకుని.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారు. వివరాలు.. ఏపీలోని బద్వేలుకు చెందిన పత్తిపాటి నర్సింహ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే బద్వేల్‌లోని ఓ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతనికి ప్రధాని మోదీ అంటే అమితమైన ఇష్టం. ఆయన ఈ ఏడాది ప్రధాని మోదీ జన్మదినం రోజున ఎలాగైనా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపాలని నిర్ణయం తీసుకున్నాడు. 

ఇందుకోసం జూలై 17న బద్వేలు నుంచి ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టాడు. మొత్తంగా 2వేల కి.మీపైకి ప్రయాణించి.. సెప్టెంబర్ 17 లోపు ఢిల్లీ చేరేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇందుకోసం అతను రోజుకు 35 నుంచి 45 కి.మీ మేర పాదయాత్ర సాగిస్తున్నారు. ప్రస్తుతం అతని యాత్ర మహారాష్ట్రలోని హింగన్ ఘాట్‌కు చేరుకుంది. మార్గమధ్యంలో బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు ఆయనకు భోజన వసతి చూసుకుంటున్నారు. అలా జరగనిపక్షంలో ఆయనే ఏదో ఒకచోట భోజనం చేస్తున్నారు. రాత్రి పూట ఏదైనా గుడిలోనో, పెట్రోల్ బంక్‌లోనో పడుకుంటున్నారు.  

ప్రధాని మోదీ పథకాలు, పరిపాలనకు నచ్చి ఈ యాత్ర చేపట్టినట్టుగా నర్సింహ తెలిపారు. జాతి ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ యాత్ర చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న వేళ... దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి తాను కూడా ఈ యాత్ర చేపట్టి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాని తెలిపారు.  దేశాన్ని రామరాజ్యంగా పిలుస్తున్నప్పటికీ.. ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామ మందిరాన్ని నిర్మించలేదని అయోధ్యను ప్రస్తావిస్తూ చెప్పారు. 

click me!