అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేస్తే.. తగాదా కేసుతో సరి : సజ్జలపై నారా లోకేశ్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Aug 09, 2022, 02:56 PM ISTUpdated : Aug 09, 2022, 02:59 PM IST
అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేస్తే.. తగాదా కేసుతో సరి : సజ్జలపై నారా లోకేశ్ ఆగ్రహం

సారాంశం

మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు టీడీపీ నేత నారా లోకేష్. సత్యసాయి జిల్లాలో అత్యాచారం జరిగిదని బాధితురాలు ఫిర్యాదు చేస్తే... తగాదా కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. 

వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. దీనిపై మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘ మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు’’ అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘ బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు. స్థానిక వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు.’’ అని లోకేశ్ ఆరోపించారు. 

‘‘ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసిపి నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి ’’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!