టీడీపీ నేత భూమా అఖిలప్రియపై కేసున నమోదు

Published : Dec 17, 2020, 07:13 AM ISTUpdated : Dec 17, 2020, 07:14 AM IST
టీడీపీ నేత భూమా అఖిలప్రియపై కేసున నమోదు

సారాంశం

మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. రహదారి దిగ్బంధం చేపట్టి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.

ఆళ్లగడ్డ: మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆళ్లగడ్డ పట్టణంలో కోవిడ్ నిబంధనల మేరకు సెక్షన్ -30 అమలులో ఉన్నప్పటికి అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టినట్లు తెలిపారు. 

వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసినందుకు అఖిప్రియపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆమెతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?