వాగులో కొట్టుకుపోయిన కారు: కూతురి శవం లభ్యం, తండ్రి కోసం గాలింపు

By telugu teamFirst Published Oct 23, 2020, 1:38 PM IST
Highlights

చిత్తూరు జిల్లాలో కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో ఒకరి మృతదేహం లభ్యమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. తండ్రీకూతుళ్లు కొట్టుకుపోయారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయి కారు సంఘటనలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ కుటుంబం ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ప్రవాహ ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.

కారు అద్దాలు పగులగొట్టి ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రతాప్ భార్య శ్యామల, బంధువు చిన్నబ్బ, కారు డ్రైవర్ కిరణ్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రతాప్ కూడా తప్పించుకున్నప్పటికీ కూతురిని రక్షించడానికి వెళ్లి గల్లంతయ్యాడు.

ప్రతాప్ కూతురు సాయి వనిత మృతదేహం లభ్యమైంది. ప్రతాప్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా గాలిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో వర్షాల కారణంగా ప్రమాదం సంభవించింది. జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లి వద్ద వాగు ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయిన విషయం తెలిలిసిందే. నీటి ప్రవాహ ఉధృతికి అది కొట్టుకుపోయింది. దాంతో ఇద్దరు గల్లంతయ్యారు.

కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీకూతుళ్లు ఇద్దరు గల్లంతయ్యారు. ఓ మహిళ, మరో వ్యక్తి, కారు డ్రైవర్ బయటపడ్డారు. వారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందినవారు. ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వరద నీటిలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయయి. పలు ప్రాంతాల్లో కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

శ్రీరంగరాజపురం మండలం దుర్గరాజుపురం వద్ద ఓ కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారు నుంచి దూకేసి ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కారు మాత్రం ప్రవాహంలో కొట్టుకుని పోయింది.

click me!