పొలంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి: మరో ఇద్దరికి గాయాలు

By narsimha lodeFirst Published 23, Oct 2020, 1:34 PM
Highlights

 కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలం శ్రీకాకుళంలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. పొలంలో మందు పిచికారీ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
 


విజయవాడ: కృష్ణా జిల్లాలోని ఘంటసాల మండలం శ్రీకాకుళంలో శుక్రవారం నాడు విషాదం చోటు చేసుకొంది. పొలంలో మందు పిచికారీ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వ్యవసాయ పొలంలో మందు పిచికారి చేస్తున్న సమయంలో ఇద్దరు కూలీలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడ గాయపడ్డారు. 
ఈ ఘటనలో మరణించిన వారిని ఎట్టివానిగూడెం గ్రామానికి చెందిన సీతారామాంజనేయులు, అనిల్ కుమార్ గా గుర్తించారు.

మరణించిన కూలీల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్ కు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. 

విద్యుత్ షాక్  రెండు వ్యవసాయ కూలీల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమ వారు మరణించడంతో ఆ కుటుంబాలు నమ్మలేకపోతున్నారు.ఈ విషయమై  తెలిసిన ఆ కుటుంబాలకు చెందిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ  విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 23, Oct 2020, 1:34 PM