రాజధాని రైతులు, మహిళల మహా నిరసన ర్యాలీ... అమరావతిలో టెన్షన్ టెన్షన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 8, 2021, 10:11 AM IST
Highlights

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు భారీ ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మొహరించడంతో అమరావతిలో టెన్షన్ వాతావరణ నెలకొంది.

రాజధాని అమరావతి లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతులు మహా నిరసన ర్యాలీ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. రాజధాని గ్రామాల్లోకి  కొత్త వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు. మీడియాతో సహా ఇతర బయట వ్యక్తులు కూడా ఆధార్ కార్డు తో పరిశీలించి గ్రామానికి చెందిన వ్యక్తి అయితేనే లోపలకు అనుమతిస్తున్నారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తులను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ఇలా పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము మాత్రం మహా నిరసన ర్యాలీ చేసి తీరుతామని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు.

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు భారీ ర్యాలీకి సిద్దమయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి రైతులు, మహిళలు నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

వీడియో

అయితే ఈ నిరసన ర్యాలీకి అనుమతించని పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరించారు. 29 గ్రామాల్లో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆటో సంఘాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్రయాణికులతో రోడ్డు మీదకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరకట్టపైనే వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. 

మరోవైపు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఆలయం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి భక్తులను కూడా అనుమతించడం లేదు. ఇలా అడుగడుగనా పోలీస్ పహారా ఏర్పాటుచేయడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. 

click me!