టెక్కలిలో విషాదం:పెళ్లిపీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Published : Aug 08, 2021, 09:43 AM IST
టెక్కలిలో విషాదం:పెళ్లిపీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

సారాంశం

మరో మూడు వారాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి సోదరి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది లీలావతి. గతంలో ప్రేమించిన యువకుడే ఆమెను వేధింపులకు గురిచేయడంతో  ఆత్మహత్య చేసుకొందని మృతుల కుటుంబసభ్యులు చెప్పారు.

టెక్కలి: మరో మూడు వారాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి  ఆత్మహత్య చేసుకొంది.  ఓ యువకుడి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యచేసుకొందని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.శ్రీకాకుళం జిల్లా లెక్కలి మండలం పెంటూరు గ్రామానికి చెందిన కె. లీలావతి  డైట్ కోర్సును పూర్తి చేసింది. ఐదేళ్ల నుండి టెక్కలిలోని తన సోదరి నివాసంలో ఉంటుంది.

విశాఖ జిల్లా సింహాచలానికి చెందిన ఓ యువకుడితో  లీలావతి వివాహం కుదిర్చారు. ఈ నెల 26న పెళ్లికి రెండు కుటుంబాలు  ముహుర్తం కుదిర్చాయి.అయితే ఏమైందో ఏమో కానీ ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో లీలావతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.జిల్లాలోని నందిగాం మండలం నరేంద్రపురానికి చెందిన పైల వెంకటేష్ తో లీలావతికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.

వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి వెంకటేష్ నిరాకరించాడు. లీలావతికి వేరే యువకుడితో పెళ్లి నిర్ణయం కావడంతో వెంకటేష్ లీలావతిని వేధింపులకు గురి చేశాడని లీలావతి తండ్రి ఆరోపించారు. ఇదే విషయమై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu