ప్రతి హాస్పిటల్లో 50శాతం బెడ్స్ ఆరోగ్యశ్రీ కే... మంత్రుల కమిటీ మరిన్ని కీలక నిర్ణయాలు

By Arun Kumar PFirst Published May 27, 2021, 3:51 PM IST
Highlights

గురువారం మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ లో కరోనా నివారణ కోసం ఏర్పాటయిన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అమరావతి: రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ లో 50% బెడ్స్ ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు కేటాయించాలని  కరోనా నివారణ కోసం ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరగాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడవద్దన్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలను పక్కాగా అమలు చేయాలని మంత్రుల కమిటీ తెలిపింది. 

గురువారం మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ లో కరోనా నివారణ కోసం ఏర్పాటయిన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి, గ్రూప్ అఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని  అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్, కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు ఇలా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. 

కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి రోగులకు వైద్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ అన్ని విభాగాల అధికారులు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది మంత్రులు కమిటీ.  

read more  ఆసుపత్రుల్లో బెడ్స్ లభ్యతపై ఇంటింటికి సమాచారం: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్

''ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలి. ప్రతి హాస్పిటల్ లో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలి. రెమిడీసివర్ ఇంజక్షన్స్ లో బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలి. ఇంజక్షన్స్ అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచాలి. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలి. ఈ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జరగాలి'' అని సంబంధిత అధికారులకు మంత్రుల కమీటీ ఆదేశించింది. 

ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్,  డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎంటి కృష్ణ బాబు, కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

click me!