ఆసుపత్రుల్లో బెడ్స్ లభ్యతపై ఇంటింటికి సమాచారం: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్

By narsimha lode  |  First Published May 27, 2021, 2:30 PM IST

వాలంటీర్ల ద్వారా కరోనా రోగులకు ఏయే ఆసుపత్రుల్లో  బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 


అమరావతి: వాలంటీర్ల ద్వారా కరోనా రోగులకు ఏయే ఆసుపత్రుల్లో  బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించనున్నట్టుగా  ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏపీలో కరోనా కేసులు, ప్రభుత్వ చర్యలపై గురువారం నాడు ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.  9  ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సుమోటో కేసులను కలిపి విచారణ  చేసింది హైకోర్టు.

జూన్ మొదటివారంలోపుగా 42 ఆక్సిజన్ ప్లాంట్లు  చేస్తామని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో కరోనా రోగుల గురించి పట్టించుకొనేవారే లేరని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా కేర్ సెంటర్లు సిటీకి దగ్గరలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.  వ్యాక్సినేషన్ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం నాడు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు. బెడ్స్ లభ్యతపై డాష్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కోవిడ్ నియంత్రణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని హైకోర్టు కోరింది. 

Latest Videos

click me!