హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ వాదనతో ఏకీభవించడంలేదు: గోవిందానంద సరస్వతి

By narsimha lode  |  First Published May 27, 2021, 3:35 PM IST

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీతో ఏకీభవించడం లేదని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి చెప్పారు. 


 తిరుమల: హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీతో ఏకీభవించడం లేదని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి చెప్పారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని గత మాసంలో టీటీడీ ప్రకటించింది. అయితే  హనుమంతుడి జన్మస్థలం కిష్కింధలోని అంజనాద్రేనని గోవిందానంద సరస్వతి చెప్పారు. ఈ విషయమై ఇవాళ తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఆయన డిబేట్ లో పాల్గొన్నారు. డిబేట్ అసంపూర్తిగానే ముగిసింది. ఈ డిబేట్ తర్వాత ఆయన  మీడియాతో మాట్లాడారు. 

also read:హనుమంతుడి జన్మస్థలంపై వివాదం: టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ల మధ్య చర్చలు

Latest Videos

హనుమంతుడి జన్మస్థలంపై బహిరంగ చర్చ అని చెప్పి అంతర్గత చర్చ పెట్టారని ఆయన విమర్శించారు. కనీసం మీడియాను కూడ అనుమతించలేదన్నారు. టీటీడీ చూపుతున్న ఆధారాలకు ప్రామాణికం లేదని చెప్పారు.  రామాయణం ప్రకారంగా హనుమంతుడు హంపిలోనే జన్మించారని ఆయన చెప్పారు. ఏ మఠాధిపతిని సంప్రదించకుండానే టీటీడీ హనుమంతుడి జన్మస్థలంపై ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై శంకారాచార్యులతో పాటు పలువురు పీఠాధిపతులకు ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. 

click me!