తెలుగు అకాడమీ ఛైర్మన్‌ లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా: ప్రభుత్వ ఉత్తర్వులు

By sivanagaprasad KodatiFirst Published Nov 13, 2019, 7:45 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నందమూరి లక్ష్మీపార్వతికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 

కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి.. వైఎస్సార్‌సీపీని స్థాపించినప్పటి నుంచి ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. టీడీపీ నేతలపై ఎదురుదాడి చేస్తూ.. వార్తల్లో నిలిచేవారు. కాగా వైసీపీ మహిళా విభాగంలో ముఖ్యులుగా ఉన్న రోజా, వాసిరెడ్డి పద్మలకు జగన్మోహన్ రెడ్డి కీలక పదవులు కట్టబెట్టారు.

Also Read:లక్ష్మీపార్వతికి జగన్ కీలక పదవి: ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియామకం

నగరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌‌గా.. వాసిరెడ్డి పద్మను ఏపీ మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్ష్మీపార్వతికి ఎలాంటి పదవిని కట్టబెడతారా అని వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూశాయి. 

కొద్దిరోజుల క్రితం చంద్రబాబుపై విరుచుకుపడిన ఆమె.. బాబుకు ఎంత వయస్సు వచ్చింది అనేది కాదు ఎంతబుద్ది వచ్చింది అనేది ఆలోచించుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  లక్ష్మీపార్వతి విమర్శించారు.

ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్ని సంస్దలు,ఎంతమంది వ్యక్తులు ఆరోపణలు చేశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పునిహితో అనే ఆయన ఏపిలో ఉన్న పరిస్దితులు అతి దారుణంగా ఉన్నాయని...దీనికంటే బీహార్ ఎంతో నయమని అన్నాడని గుర్తుచేశారు.

Also Read:పొలిటికల్ కరెప్షన్ ఓకే... వారి అవినీతే తగ్గాలి...: మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతి విలయతాండవం చేసిందన్నారు. చంద్రబాబు రూ.6.50 లక్షల మేర దోపిడీ చేశారని దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  పుస్తకం కూడా ప్రచురించడం జరిగిందన్నారు.

అలాగే  కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ప్రజావంచన పేరుతో చంద్రబాబు పరిపాలనపై పుస్తకం రాశారన్నారు.  ఇంత అవినీతి చేసిన చంద్రబాబు,లోకేష్ లు రహస్యంగా వందల జిఓలు విడుదల చేశారని ఆరోపించారు.

వారిద్దరు రహస్యంగా విదేశీ ప్రయాణాలు చేసి ఇక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకువెళ్లి అక్కడ దాచిపెట్టారని ఆరోపించారు. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు అవినీతిపై క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తుల్లో తాను ఒకరినని....అందువల్లే ఆయనపై పలు కేసులు వేశానన్నారు. ఏకంగా ప్రధానిమంత్రి మోడీ సైతం పోలవరంను చంద్రబాబు ఏటిఎంలా వాడుకున్నారని చెప్పడమే ఆయన అవినీతికి పెద్ద ఉదాహరణ అన్నారు.  

click me!