ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్

By Siva KodatiFirst Published Nov 13, 2019, 6:23 PM IST
Highlights

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై వైఎస్ జగన్ ప్రభుత్వం వేగం పెంచింది. దీనిలో భాగంగా ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించింది

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై వైఎస్ జగన్ ప్రభుత్వం వేగం పెంచింది. దీనిలో భాగంగా ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఐఏఎస్ అధికారి వెట్రిసిల్వికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సర్వే ల్యాండ్ రికార్డ్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధనకు కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టుగా, మిగిలిన తరగతుల్లో ఒక్కొక్క ఏడాదీ, ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన జరగనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనకోసం తల్లిదండ్రులనుంచి, ఉపాధ్యాయులు, ఇతర మేధావులనుంచి పెద్ద ఎత్తున డిమాండ్‌ వచ్చిందని మంత్రివర్గం తెలిపింది. తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం కోరుకుంటున్నారని, దీనివల్లే ప్రై వేటు విద్యాసంస్థల్లో ఏటా ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతోందని కేబినెట్ వెల్లడించింది.

Also read:నీకే నోరు ఉందా.. మాకు లేదా: పవన్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్

ప్రైవేటు విద్యాసంస్థల్లో 98.5శాతం ఇంగ్లిషు మీడియంలోనే చదువుతున్నారని గుర్తుచేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటినుంచి 10 వ తరగతి వరకూ 37.21 లక్షల మంది చదువుతుంటే... ఇందులో 3265 సక్సెస్‌ హైస్కూల్లో సమాంతరంగా ఇంగ్లిషుమీడియంలో విద్యా బోధన జరుగుతోందని కేబినెట్ పేర్కొంది.

11,37,043 మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ప్రై వేటు విద్యా సంస్ధల్లో 98.5 శాతం స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలో ఉండగా.. ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 34 శాతం స్కూళ్లలో మాత్రమే ఆంగ్ల బోధన వుంది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై పవన్ మరోసారి ఘాటుగా స్పందించారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన పరిస్థితుల్లో ఇంగ్లీష్ అత్యవసరమే కానీ.. సంస్కృతి మూలాలను, భాషను చంపుకోవడం సరికాదన్నారు.

Also read:Pawan: జగన్మోహన్ రెడ్డి మట్టిలో కలిసిపోతారు: పవన్ కల్యాణ్ శాపనార్థాలు

రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి.. తెలుగు శిలాఫలకాలు దొరికిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తెలుగు భాష ఉనికిని కాపాడాలని సూచించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుల్నే జగన్ సైతం ఫాలో అవుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు.

అన్ని సరిదిద్దుతున్నామని అనుకున్నప్పుడు తెలుగుభాష విషయంలో మాత్రం ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని జనసేన నిలదీశారు. తాను తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నానని... ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగా ఉంటే తెలుగు మీడియంలో చదువుకోవడానికి పిల్లలు ఇష్టపడరని పవన్ తెలిపారు.

click me!