మనశాండ్ వెబ్‌సైట్ హ్యాక్: విశాఖలో సీఐడీ సోదాలు

By sivanagaprasad KodatiFirst Published Nov 13, 2019, 6:33 PM IST
Highlights

విశాఖలో బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు సోదాలు జరుపుతోంది. మనశాండ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో హ్యాక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

విశాఖలో బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు సోదాలు జరుపుతోంది. మనశాండ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో హ్యాక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్‌ను హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా మనశాండ్ వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థ నిర్వహించింది.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త ఇసుక పాలసీ కింద మనశాండ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలకు ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను సైతం డెవలప్‌ చేశారు.

అయితే ఈ సంస్ధకు చెందిన కొంతమంది ఉద్యోగులతో కలిసి డేటాను హ్యాక్ చేయడంతో పాటు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టిస్తున్నట్లుగా సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన సీఐడీ అధికారులు.. విశాఖలోని బ్లూ ఫ్రాగ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది.

Also Read:ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్

ఈ ఆరోపణలకు పూర్తి ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా ఇప్పటి వరకు ఎంత స్టాక్‌ను బ్లాక్ చేసిన విషయాన్ని తేలుస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ఎవరికి ఆర్ధిక ప్రయోజనాలు అందాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనితో పాటు డేటాను హ్యాక్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లిందో తేల్చేందుకు సీఐడీ ప్రయత్నిస్తోంది.

ఇసుక నిల్వ చేసినా అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, పునర్విక్రయం చేసినా కఠినచర్యలు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది.

Also read:ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షలు జరిమానా: ఏపీ కేబినెట్ నిర్ణయం

ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికితే కనీసం జరిమానా రూ.2 లక్షల రూపాయలతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణకు ఆమోదముద్ర వేసింది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

ఇసుక డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో ఒక వారం పాటు ప్రభుత్వంలోని కొన్ని యంత్రాంగాలను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లుగా నాని తెలిపారు. ప్రతి రోజు లక్షా యాభైవేల నుంచి రెండు లక్షల టన్నుల వరకు ఇసుక లభ్యత ఉండేలా చర్యలు చేపడతామన్నారు

click me!