డిసెంబర్ చివరి నాటికి.. పిల్లల కోసం తిరుపతి ట్రస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..

By SumaBala BukkaFirst Published Jun 28, 2023, 11:45 AM IST
Highlights

డిసెంబర్ చివరి నాటికి  పిల్లల కోసం టిటిడి నిర్మిస్తున్న తిరుపతి ట్రస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.  

తిరుపతి : దేవాలయాల నగరమైన తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పిల్లల కోసం నిర్మిస్తున్న శ్రీ పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అత్యాధునిక ఆసుపత్రి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. 

మంగళవారం అలిపిరి సమీపంలోని నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనులను టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఆలయ పాలకమండలి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

వివాహేతర సంబంధం : అనుమానించాడని భర్తపై కత్తితో దాడిచేసి చంపేసిన భార్య, జీవితఖైదు విధించిన కోర్టు...

ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి బాలల చిల్డ్రెన్ హార్ట్ సెంటర్ దేశంలోనే అత్యుత్తమ బాలల ఆసుపత్రిగా నిలిచిందని టీటీడీ ఈవో గుర్తుచేశారు.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1450 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించామని, జీవన్ దాన్ కార్యక్రమం కింద నాలుగు గుండె మార్పిడి విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

షెడ్యూల్ ప్రకారం శాశ్వత స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా ఆసుపత్రిని గ్రౌండింగ్ చేయగలుగుతామని టీటీడీ ఈవో తెలిపారు.

click me!