
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగార్దులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేల ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి అర్హత కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నెలకు రూ.15వేలు జీతం వస్తుంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ లోని వైయస్సార్ జిల్లా రోడ్డు భవనాల శాఖలో.. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు వివరాలు, పోస్టుల గురించిన సమాచారం ఇలా ఉంది…
పోస్టులు..
శానిటరీ వర్కర్లు : 8 పోస్టులు
వాచ్ మెన్ : 6 పోస్టులు
ఆఫీస్ సబార్డినేట్స్ : 10 పోస్టులు
అర్హత : పదో తరగతి పాసై ఉండాలి
వేతనం : నెలకు రూ.15000. ఆ తర్వాత ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి.
అప్లై చేసుకోవడం ఇలా..
ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆర్ అండ్ బి) సర్కిల్ కార్యాలయం, కడప, మారుతీ నగర్, వైఎస్సార్ జిల్లా చిరునామాకు పంపాలి.
అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్..
ఫిబ్రవరి 22, 2024, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు, మరిన్ని వివరాలు కావాలంటే.. అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.