
Buggana Rajendranath Biography: ఆయన మృధుస్వభావి, తన ఛలోక్తులతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తారు. ఏ అంశం ఏదైనా విషయపరిఙ్ఞానంతో కూడిన ప్రసంగం చేస్తాడు. స్వపక్ష, ప్రతిపక్ష అనే భేదం లేకుండా అందరి మన్ననలు చొరగొట్టారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలుమీ కోసం
బాల్యం, విద్యాభ్యాసం
బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల లో 1970 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీదేవి, రామనాథన్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తరువాత చెన్నైలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత 1992లో బళ్లారిలోని రావు బహదూర్ వై మహాబలేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలను అనర్గలంగా మాట్లాడగలడు. ఆసక్తికర విషయమేటంటే.. తెలుగు చిత్రసీమలో అలనాటి ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి బుగ్గన్నకు స్వయాన తాత. బుగ్గన తండ్రి బుగ్గన రాంనాథ్ రెడ్డి అప్పట్లోనే అయితే ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్
రాజకీయ జీవితం
బుగ్గన రాజేంద్రనాథ్ పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు. వారి స్పూర్తితో వారు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బుగ్గన రాజేందర్ కూడా తన కుటుంబ వారసత్వాన్ని అనుసరిస్తూ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఈ రాజకీయ ప్రయాణంలో తొలుత ఆయన బేతంచెర్ల గ్రామ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. 2014 లో వైఎస్‌ఆర్‌సిపి తరపున ధోన్ (అసెంబ్లీ నియోజకవర్గం) నుంచి పోటీ చేసి 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాడు.టిడిపి నుంచి పోటీ చేసిన కేజీ ప్రతాప్ పై పదివేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. ఇక 2016-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మనుగా పనిచేసాడు.
ఇక 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈ సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. మంత్రిత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 31 అక్టోబర్ 2021న ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. అలాగే.. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక ప్రణాళిక శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు