
విజయవాడ: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా చావడానికైనా తాము సిద్దమేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.బుధవారం నాడు Buddha Venkanna మీడియాతో మాట్లాడారు. Chandrababu Naiduపై చెత్తవాగుడు మానుకోవాలని సూచించారు. 100 మందితో Suicide బ్యాచ్ తయారు చేశామన్నారు. చంపడానికైనా చావడానికైనా సిద్దమేనన్నారు. చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు మానుకోవాలని ఆయన YCP నేతలకు సూచించారు. అంతేకాదు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కోరారు.చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు.
చంద్రబాబును తిడితే TDP ఆఫీస్ పై దాడి చేస్తే పదవులు వస్తాయనే భ్రమల నుండి వైసీపీ నేతలు బయటకు రావాలన్నారు. సీనియర్లను కాదని జోగి రమేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాల్సిందేనన్నారు.