Chandrababu : ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత... నేరం కాదు : హైకోర్టుకు చంద్రబాబు లాయర్లు

By Arun Kumar P  |  First Published Nov 22, 2023, 4:14 PM IST

ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు ఆనాటి ముఖ్యమంత్రిని బాధ్యున్ని చేయడం తగదని హైకోర్టులో వాదించారు చంద్రబాబు లాయర్లు. 


అమరావతి :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక  విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసిన తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా చంద్రబాబు దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. సిఐడివి కేవలం ఆరోపణలేనని... ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేసారని చంద్రబాబు లాయర్లు వాదించారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని లాయర్లు అన్నారు. 
 
గత టిడిపి ప్రభుత్వం సామాన్యుల కోసమే ఇసుకను ఉచితంగా ఇచ్చారని... దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని అనడానికి లేదన్నారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని... ఓ వ్యక్తి అందుకు భాద్యులను చేయలేమన్నారు. ఉచిత ఇసుక పంపిణీ చేయడం చట్టవిరుద్దమేమీ కాదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 

అసాధారణ పరిస్థితుల్లో ప్రజల సమస్యను దృష్టిలో వుంచుకునే ఉచిత ఇసుక నిర్ణయాన్ని ఆనాటి ప్రభుత్వం తీసుకుందని చంద్రబాబు లాయర్లు తెలిపారు. ఇసుక ధర బాగా పెరిగి పేదల గృహనిర్మాణానికి ఇబ్బంది తలెత్తినప్పుడు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని... ఈ క్రమంలోనే ఉచితంగా ఇసుక ఇచ్చారన్నారు. 

Latest Videos

Read More  Atchannaidu : వాలంటీర్ల వద్ద వివాహేతర సంబంధాల డేటా... ఎందుకో తెలుసా? : అచ్చెన్నాయుడు సంచలనం

ఈ ఇసుక కేసులో చంద్రబాబు తరపు వాదనలు వినిపించారు లాయర్లు. ఇక సిఐడి తరపున వాదనలు వినిపించాల్సి వుంది. మరికొద్దిసేటపట్లో ఈ వాదన కూడా జరగనుంది. ఇరువురి వాదనవిన్న న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 

click me!