విశాఖపట్టణంలో కీలకమైన ఇద్దరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ మధ్య రాజకీయాల చర్చ జరగలేదని గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలు ప్రకటించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ గురువారం నాడు భేటీ అయ్యారు. అదే విధంగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సమావేశం ినర్వహించడం విశాఖపట్టణం రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రంగం సిద్దం చేసుకుంటుంది. మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఇటీవలనే బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు. విశాఖపట్టణంలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది . బీఆర్ఎస్ లో చేరాలని గంటా శ్రీనివాసరావుతో పాటు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివేక్ ఆహ్వానించారనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తోసిపుచ్చారు. ఓ వివాహ ఫంక్షన్ లో కలిస్తే ఇంటికి ఆహ్వానించినట్టుగా చెప్పారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావన జరగలేదన్నారు.
వివేక్ ను బ్రేక్ ఫాస్ట్ కు పిలిచినట్టుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తమ మధ్య రాజకీయాల చర్చ జరగలేదన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలిసి చాలా రోజులైందని గంటా శ్రీనివాసరావు తెలిపారు.2019 ఎన్నికల తర్వాత టీడీపీతో అంటీముట్టనట్టుగానే మాజీ మంత్రి గంటా వ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం సాగింది. ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఇటీవలనే ఆయన నారా లోకేష్ తో భేటీ అయ్యారు. గత మాసంలో జరిగిన ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో కొంతకాలం పాటు రాజీకీయాల్లో అంత యాక్టివ్ గా లేనని గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారుతానన్నారు.ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ గంటా శ్రీనివాసరావుతో భేటీ కావడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.