ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్దమా?: కోటంరెడ్డికి మాజీ మంత్రి అనిల్ సవాల్

By narsimha lodeFirst Published Feb 2, 2023, 7:58 PM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్  జరగలేదని  తాను నిరూపిస్తే  ఎమ్మెల్యే పదవికి  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  రాజీనామా చేస్తారా అని  మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  సవాల్ విసిరారు.  
 

నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్ జరిగిందని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరూపిస్తే   తాను  తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని  మాజీ మంత్రి అనిల్ యాదవ్  సవాల్ విసిరారు.గురువారం నాడు  నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన ఆరోపణల గురించి ఆయన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్  జరగలేదని  నిరూపిస్తే   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని  ఆయన  ప్రశ్నించారు.   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చెబుతున్న ఆడియో సంభాషణ పూర్తిగా విడుదల చేయాలని  ఆయన కోరారు.   ఫోన్ ట్యాపింగ్  జరగలేదని  మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తన సవాల్ కు  స్వీకరించాలని ఆయన  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కోరారు.  స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా లేఖలను  తీసుకెళ్లి స్పీకర్ కు  ఇద్దామని  అనిల్ కుమార్ యాదవ్  శ్రీధర్ రెడ్డిని కోరారు.    పార్టీని వీడాలని నిర్ణయించుకొని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  తప్పుడు ఆరోపణలు  చేస్తున్నారని  ఆయన  మండిపడ్డారు. తన ఫోన్ ట్యాపింగ్  జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.  వైసీపీని వీడి టీడీపీలో  చేరాలని నిర్ణయించుకున్నందునే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు  చేస్తున్నారని  ఆయన  చెప్పారు, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో  ఇవాళ సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిణామాలపై చర్చించారు.   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో  నెల్లూరు రూరల్  ఇంచార్జీగా  మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి  బాధ్యతలను అప్పగించింది  వైసీపీ నాయకత్వం.

click me!