జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల రంగంలోకి దూకుతున్నారు. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. అనకాపల్లి నుంచి వచ్చే నెల 4వ తేదీ నుంచి క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దూకనున్నారు. ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలు పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ అన్ని సీట్లల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. కాగా, మొత్తం 175 స్థానాల్లో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే, ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలలేదు. చెరో రెండు సీట్లను ప్రకటించుకున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని పవన్ కళ్యాణ్ మండిపడుతూ రెండు సీట్లను ప్రకటించినా.. పొత్తును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పొత్తులోనూ ఉభయ పార్టీలు కలిసే ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన ప్రచారం ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఆదివారం అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్లు జరుగుతున్నాయి. ఇక ఆయన అనకాపల్లి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ ... రేవంత్ బాటలోనే వైఎస్ జగన్...?
వచ్చే నెల 4వ తేదీన నూకాలమ్మ తల్లి అమ్మవారిని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సభలో కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరబోతున్నారు.