ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ఈ స్థితిలో కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఓ పెళ్లి కూతురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది.. దాంతో వివాహం వాయిదా పడింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఈ స్థితిలో ఓ పెళ్లి కూతురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో రేపు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ రేపు సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా ప్రతి 24 గంటలకు వేయేసి కేసులు నమోదవుతున్నాయి. ఈ స్థితిలో జిల్లాలో కర్ఫ్యూ విధించారు.
undefined
కాగా, శనివారనాటి లెక్కల ప్రకారం..... కరోనా వైరస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అట్టుడుకుతోంది. తాజాగా గత 24 గంటల్లో కూడా ఈ జిల్లాలో వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కోవిడ్-19 తాజాగా జడలు విరబోసుకుంది. గత 24 గంటల్లో కొత్తగా ఈ జిల్లాలో 1012 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. మొత్తం ఇప్పటి వరకు 88671 కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 723, చిత్తూరు జిల్లాలో 300, గుంటూరు జిల్లాలో 656, కడప జిల్లాలో 294 కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో 407, కర్నూలు జిల్లాలో 742, నెల్లూరు జిల్లాలో 299, ప్రకాశం జిల్లాలో 248, శ్రకాకుళం జిల్లాలో 349, విశాఖపట్నం జిల్లాలో 936, విజయనగరం జిల్లాలో 523 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో 12391 కేసులతో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానానికి ఎగబాకింది.
మరణాల సంఖ్యలో కూడా తూర్పు గోదారి జిల్లా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 113 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 156 మంది మరణించారు. కృష్ణా జిల్లా 139 మరణాలతో రెండో స్థానంలో ఉంది.
ఇదిలావుంటే, తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ బారిన పడి52 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మరణించారు. తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చనిపోయారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 985కు చేరుకుంది.
ఏపీలో ఇప్పటి వరకు జిల్లాలవారీగా నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం 8989, మరణాలు 81
చిత్తూరు 6869, మరణాలు 73
తూర్పు గోదావరి 12391, మరణాలు 113
గుంటూరు 9456, మరణాలు 97
కడప 4361, మరణాలు 29
కృష్ణా 5248, మరణాలు 139
కర్నూలు 10357, మరణాలు 156
నెల్లూరు 4025, మరణాలు 23
ప్రకాశం 3307, మరణాలు 47
శ్రీకాకుళం 4298, మరణాలు 55
విశాఖపట్నం 5997, మరమాలు 65
విజయనగరం 2925, మరణాలు 33
పశ్చిమ గోదావరి 7553, మరణాలు 74