ఉమ్మడి విశాఖ జిల్లాలో మధురపూడిలో పెళ్లి మండపంలో పెళ్లి కూతురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. జీలకర్ర బెల్లం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వధువు గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
విశాఖపట్టణం: ఉమ్మడి Visakhapatnam జిల్లాలోని మధురపూడిలో పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకొంది. పెళ్లి పీటలపైనే Bride కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలించే లొోపుగానే మరణించింది. గుండెపోటుతోనే వధువు సృజన మరణించింది.
Madhurawadaలో పెళ్లి పందిరిలో వధూవరుల మధ్య జీలకర్ర బెల్లం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వధువు ఒక్క సారిగా పెళ్లి పీటలపై కుప్పకూలింది. కొద్ది సేపట్లోనే కాబోయే భర్తతో తాళి కట్టించుకొనే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పెళ్లి మండపంలోనే అనుకోని ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
undefined
మధురవాడలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఈ వివాహం జరగాల్సి ఉంది. వివాహం జరిగే ప్రక్రియలో భాగంగా జీలకర్ర, బెల్లం ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే వధువు స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వధువును పరీక్షించిన వైద్యులు అయితే ఆమె మరణించిందని ప్రకటించారు. పెళ్లి పనుల కారణంగా అలసటతో స్పృహ తప్పిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ వధువు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం నాడు రాత్రి 7 గంటలకు పెళ్లి ముహుర్తం పిక్స్ చేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుపుకున్నారు.
వధువు మృతదేహం నుండి నమూనాలను కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. మరో వైపు ఈ విషయమై విశాఖపట్టణం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పనుల్లో కూడా సృజన బిజీ బిజీగా ఉందని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు. మరో వైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా ,ఉత్సాహంగా గడిపిన క్షణాలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 11న విశాఖపట్టణంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన చోరీ చేసుకంది. పెళ్లికి కొన్ని గంటల ముందే వరుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని దినేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. పెళ్లికి ముందు రోజు ఇంటి నుండి వెళ్లిపోయిన దినేష్ సూసైడ్ చేసుకొన్నాడు. మృతుడు దినేష్ విశాఖపట్టణంలోని హెచ్‌పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు.