విజయవాడ లంబాడీపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం: ఐదు బైక్ ల దగ్ధం

By narsimha lodeFirst Published May 12, 2022, 12:13 PM IST
Highlights

విజయవాడ కొత్తపేట లంబాడీపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఐదు బైక్ లను దగ్దం చేశారు. ఈ విఁషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


విజయవాడ:ఎన్టీఆర్ జిల్లాలోని కొత్తపేట లంబాడీపేటలో Ganja Batch బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో  బుధవారం నాడు రాత్రి ఐదు Motor Bike లను దగ్దం చేశారు. శివారు ప్రాంతం కావడంతో  గంజాయి మత్తులో  కొందరు యువకులు జోగుతున్నారు.  గంజాయి మత్తులో ఉన్న వారంతా బైక్ లను దగ్దం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను దగ్దం చేశారు.ఈ విషయమై Policeలకు బాధితులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  పరిశీలించారు.

మరోవైపు Vijayawada లో బ్లేడ్ బ్యాచ్ కూడా తరచూ ఇదే తరహాలో గొడవలు చేస్తున్న ఘటనలు కూడా లేకపోలేదు. విజయవాడ వించిపేట సమీపంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు మధ్య ఘర్షణ చెలరేగింది. వించిపేట- న్యూ రాజరాజేశ్వరి పేట మధ్యలో రైల్వే యార్డ్ సమీపంలో సూర్య అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.ఈ ఘటన 2021  మే 8న చోటు చేసుకొంది. 

హత్య చేసిన తర్వాత శవాన్ని రైల్వే యార్డులో పడేశారు దుండగులు. మృతుడు సూర్య పలు కేసుల్లో నిందితుడిగా వున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే యార్డుకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

 తాడేపల్లిలోని జగజ్జివన్ రావు కాలనీలో  గంజాయి, బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. నగదు ఇవ్వాలంటూ వంశీ అనే యువకుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన 2021 ఏప్రిల్ 3న జరిగింది. 

స్థానికులు అడ్డుకోవడంతో, స్థానికులపై కూడా యువకులు  దాడి చేశారు. అనంతరం ఓ మహిళ మెడలో బంగారు చైన్ ను లాక్కొని యువకులు పరారయ్యారు.  బాధితులు పొలీస్ స్టేషన్లో 5 గురు యువకులపై ఫిర్యాదు చేశారు.

గత కొంతకాలంగా నులకపేట, ఎర్రక్వారీ, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి దౌర్జన్యాలకు  యువత పాల్పడుతున్నారు.

2020 జూన్ మాసంలో  అత్యంత ప్రమాదకరమైన రీతిలో దోపిడీలకు పాల్పడుతూ  అలజడి సృష్టిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆట కట్టించారు కృష్ణా జిల్లా పోలీసులు. ఏలూరు నుంచి బ్లేడ్ బ్యాచ్ వస్తున్నట్లు పక్కా సమాచారంతో అలెర్ట్ అయిన గన్నవరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా బ్లేడ్లు, కొంత నగదు, డియో బైక్, 4కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గన్నవరం మండలం గూడవల్లి సమీపంలో రెండు రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ పై దాడికి పాల్పడింది ఈ బ్లేడ్ బ్యాచ్. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఈ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు. 

ప్రస్తుతం పట్టుబడిన వారందరూ విజయవాడ వన్ టౌన్ కు చెందినవారుగా గన్నవరం పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పై దాడి కేసుతో పాటు ఏవయినా ఇతర కేసుల్లో కూడా  వీరికి ప్రమేయముందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వీరిపై మాధకద్రవ్యాల కేసు కూడా నమోదు చేయనున్నట్లు గన్నవరం పోలీసులు తెలిపారు. 
 

click me!