"వెంకన్న గుడి నాలుగు దినాలు మూతబడెను"..బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా..?

First Published Jul 17, 2018, 3:56 PM IST
Highlights

పూర్వకాలంలో అనేక సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒకరు


పూర్వకాలంలో అనేక సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాల్లో నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి.

దేశానికి స్వాతంత్ర్యం, గాంధీ గారు, ఇందిరాగాంధీ పరిపాలన ఇలా ఆయన చెప్పింది చెప్పినట్లు పొల్లుపోకుండా జరిగింది. అదే కాలజ్ఞానంలో ఓ చోట తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా చెప్పారు.. ‘‘వెంకన్న గుడి నాలుగు రోజులు పూజల్లేక మూతబడెను’’ అని ఆయన పలికారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి ఆ మాట నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. 12 ఏళ్లకొసారి శ్రీవారి ఆలయంలో జరిగే మహాసంప్రోక్షణ  కార్యక్రమాన్ని వచ్చే నెలలో జరిపేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 9 నుంచి ఆగస్టు 17 వరకు 9 రోజుల పాటు దర్శనాన్ని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి.. భక్తులను పరిమితంగా అయినా భక్తులను దర్శనానికి అనుమతించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న మరోసారి బోర్డు అత్యవసర సమావేశం కానుంది..

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మరి తిరుమల ఆలయం గురించి బ్రహ్మాంగారి కాలజ్ఞానం నిజమవుతుందా..? లేక దీనికి మరికొంత సమయం పడుతుందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

click me!