స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారు.. అడ్డుకునేందుకు వెళితే తోసేశారు: వైసీపీ ఎమ్మెల్యేలు

Published : Mar 20, 2023, 11:04 AM IST
స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారు.. అడ్డుకునేందుకు వెళితే తోసేశారు: వైసీపీ ఎమ్మెల్యేలు

సారాంశం

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు స్పీకరపై దాడి చేయడం  దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు.చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులతో దాడి చేయించి తన రక్త కళ్ల చూశారని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే శాసనసభలో టీడీపీ సభ్యులు స్పీకరపై దాడి చేయడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులతో తనపై దాడి చేయించి తన రక్త కళ్ల చూశారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, అశోక్‌లు స్పీకర్‌పై దాడికి యత్నిస్తుంటే తాము అడ్డుకున్నామని చెప్పారు. తనను తోసేయడంతో కిందపడినట్టుగా చెప్పారు. ఆ తర్వాత  బాలవీరాంజేయస్వామి కింపడినట్టుగా చెప్పుకొచ్చారు. సభలో దాడి చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. స్పీకర్‌పై టీడీపీ సభ్యుడు డోలా బాలవీరాంజనేయ స్వామి దాడి చేశారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళితే తనపై, సుధాకర్ బాబుపై దాడి చేశారని చెప్పారు. 

ఇక, ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్దమవ్వగా టీడీపీ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు గౌరవం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు సూచించారు. అయితే తమ హక్కులను కాపాడాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకని స్పీకర్‌పై పేపర్లను చించివేశారు.

అయితే టీడీపీ సభ్యులపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ సజావుగా  జరగాలంటే.. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పక్షంలోనే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి,  వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లగా.. మంత్రి అంటి రాంబాబు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan: మేం వచ్చాక స్టేషన్ల చుట్టూ తిప్పుతా రాధాకృష్ణకి మాస్‌ వార్నింగ్‌ | Asianet News Telugu
YS Jagan Mass Warning to CM Chandrababu: చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తా | Asianet News Telugu