సీఎం జగన్ ఇంటి ముందు బాలుడి కలకలం.. అరెస్ట్

Published : Jun 01, 2019, 09:03 AM IST
సీఎం జగన్ ఇంటి ముందు బాలుడి కలకలం.. అరెస్ట్

సారాంశం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద శనివారం ఉదయం  ఓ బాలుడు కలకలం సృష్టించాడు. జగన్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద శనివారం ఉదయం  ఓ బాలుడు కలకలం సృష్టించాడు. జగన్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

పదేళ్ల వయసున్న ఆ బాలుడి  వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్‌ అంటున్న ఆ కుర్రాడు.. తమది బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలీ బాలుడు ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వచ్చాడు, అతనితో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్