మంత్రివర్గ కూర్పు: జగన్ పరిశీలనలో ఉన్న జాబితా ఇదే...

By telugu teamFirst Published Jun 1, 2019, 8:00 AM IST
Highlights

గురువారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అయితే, మంచి ముహూర్తం కోసం ఈ నెల 8వ తేదీ వరకు ఆగుతున్నారు. తొలి విడత 15 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గ సభ్యుల ఎంపికపై కసరత్తును దాదాపుగా పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈనెల 8న ఉదయం 9.15 గంటలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రితో సహా 26మంది మంత్రివర్గంలో ఉండవచ్చు. 

గురువారం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అయితే, మంచి ముహూర్తం కోసం ఈ నెల 8వ తేదీ వరకు ఆగుతున్నారు. తొలి విడత 15 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం ఒక్కరు ఉండే విధంగా చూసుకుంటున్నారు. 

మంత్రివర్గంలోకి జగన్ పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే... 
 
 శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట), కళావతి (పాలకొండ), రెడ్డి శాంతి (పాతపట్నం).

విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), పుష్పశ్రీవాణి (కురుపాం), రాజన్నదొర (సాలూరు).

విశాఖపట్నం జిల్లా: గుడివాడ అమరనాథ్‌ (అనకాపల్లి), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), ముత్యాలనాయుడు (మాడుగుల).

తూర్పు గోదావరి జిల్లా: ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్‌), దాడిశెట్టి రాజా(తుని).

పశ్చిమగోదావరి జిల్లా: ఆళ్ల నాని (ఏలూరు), తెల్లం బాలరాజు (పోలవరం), తానేటి వనిత (కొవ్వూరు), గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం).

కృష్ణా జిల్లా: కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), కొలుసు పార్థసారథి (పెనమలూరు), మేకా వెంకట ప్రతాప అప్పారావు (నూజివీడు).

గుంటూరు జిల్లా: మర్రి రాజశేఖర్‌ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి).

ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), ఆదిమూలపు సురేశ్‌ (యర్రగొండపాలెం).

చిత్తూరు జిల్లా: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి).

నెల్లూరు జిల్లా: మేకపాటి గౌతంరెడ్డి (ఆత్మకూరు), రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి (కావలి), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి).

కడప జిల్లా: గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), అంజాద్‌బాషా (కడప).

కర్నూలు జిల్లా: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), శ్రీదేవి (పత్తికొండ), హఫీజ్‌ఖాన్‌ (కర్నూలు).

అనంతపురం జిల్లా: అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్‌), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), ఎం.శంకరనారాయణ (పెనుకొండ).
 

click me!