రాళ్లు విసిరారంటూ చంద్రబాబు కొత్త డ్రామా.. మండిపడ్డ బొత్స (వీడియో)

By AN Telugu  |  First Published Apr 13, 2021, 7:40 PM IST

ఎన్నికల ప్రచారంలో రాళ్ళ విసిరారని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. 


ఎన్నికల ప్రచారంలో రాళ్ళ విసిరారని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. 

"

Latest Videos

undefined

ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని బీజేపీ సున్నా అని తెలిసే పవన్ కల్యాణ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో టీడీపికి డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. 

ఇప్పటికే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు  తోక కట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అయినా  బాబు మైండ్ సెట్ మార్చుకోవాలి. బాబు మాయలు, మేనేజ్మెంట్ లు ఇక పనిచేయవు అని మండిపడ్డారు.

బిజెపి జాతీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఖండించామన్నారు. లోకేష్ గురించి అచ్చెన్నాయుడు నిజమే చెప్పారన్నారు. తాము మీడియా ముందు మాట్లాడే విషయాన్ని అచ్చెన్న నాలుగు గోడల మధ్య చెప్పారని చెప్పుకొచ్చారు. 

​కాగా, సోమవారం తిరుపతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.  బాబు ప్రచారం నిర్వహిస్తున్న వాహనం లక్ష్యంగా చేసుకొని  రాళ్లు విసిరారు.ఈ రాళ్లదాడిలో ఓ మహిళకు, యువకుడికిగా గాయాలయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  తనపై  జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన రాళ్లను చంద్రబాబునాయుడు సభలో చూపించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన ఈ విషయమై ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనను నిరసిస్తూ చంద్రబాబునాయుడు ప్రచార వాహనం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. చంద్రబాబునాయుడును నిరసన వద్దని పోలీసులు కోరారు.జడ్ ప్లస్ కేటగరి రక్షణ ఉన్న  తనకే భద్రత కల్పించలేని  తనకు రక్షణ కల్పించలేని మీరు సామాన్యులకు ఏం రక్షన కల్పిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. 

పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

click me!