
వైసీపీ సీనియర్ నేత బొత్సాసత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముఠా నాయకుడుని చేసేసారు. శుక్రవారం నంద్యాలలో మీడియాతో బొత్సా మాట్లాడుతూ ఉపఎన్నికల కోసం ఇప్పటికే 8 మంది మంత్రుల ముఠాను దింపిన ముఠానేత చంద్రబాబు శనివారం మరోసారి నంద్యాలకు వస్తున్నట్లు ఎద్దేవా చేసారు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేని చంద్రబాబు ఉపఎన్నికలో ఇంకెన్ని హామీలను గుప్పిస్తారో చూడాలన్నారు. ఓట్ల కోసం అభివృద్ధి పేరుతో చేపట్టిన రోడ్ల విస్తరణలో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా షాపులను కూల్చేస్తున్నట్లు మండిపడ్డారు.