పోలవరం ఓ కుట్ర...

First Published Jul 21, 2017, 2:25 PM IST
Highlights
  • తాను బ్రతికుండగా పోలవరం పూర్తయితే ఉపశమనం పొందుతానని చెప్పారు.
  • కేవలం డబ్బుల కోసమే పట్టిసీమను చేపట్టినట్లు ఆరోపించారు. 
  • పట్టిసీమలో  కాగ్ చెప్పిన రూ. 390 కోట్ల అవినీతి మాటేంటని సూటిగా ప్రశ్నించారు.
  • పబ్లిక్ అకౌంట్స్ కమిటిని కూడా నియమించుకోలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
  • చంద్రబాబు పాలన ఇదే విధంగా ఉంటే తాను ప్రధానమంత్రి మోడీని కలుసి ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించటం గమనార్హం.

పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయటం కోసమే పట్టిసీమ, పురషోత్తమ పట్నం ప్రాజెక్టులను చంద్రబాబునాయుడు చేపడుతున్నట్లు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. తాను బ్రతికుండగా పోలవరం పూర్తయితే ఉపశమనం పొందుతానని చెప్పారు. కేవలం డబ్బుల కోసమే పట్టిసీమను చేపట్టినట్లు ఆరోపించారు.  పట్టిసీమలో  కాగ్ చెప్పిన రూ. 390 కోట్ల అవినీతి మాటేంటని సూటిగా ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటిని కూడా నియమించుకోలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితమిచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేసారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు మొదలు పెట్టాక పోలవరం కట్టరని నిర్దారణ అయ్యిందన్నారు. వైఎస్ హయాంలో జరిగిన జలయజ్ఞం అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్దమన్నారు. రాజా ఆఫ్ కరెప్షన్ బుక్ పై చర్చకు రావాలని ఆనాడే పార్లమెంట్ లో యర్రంనాయుడుకు సవాల్ చేసిన సంగతిని గుర్తు చేసారు. ఎపిలో 14 లక్షల ఎకరాలకు వైఎస్ హయాంలోనే నీరు ఇచ్చారని తెలిపారు.

పట్టిసీమ ద్వారా 2016 ఆగష్టులో 4.21 టిఎంసి నీరు ఇచ్చామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటులో చెబితే ఇక్కడ నాయకులు మాత్రం 8 టిఎంసిలు అని చెబుతున్నారని దుయ్యబట్టారు. 2014 అంచనా ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేస్తుంటే చంద్రబాబు మత్రం అంచనాలు పెంచుకొని అందరిని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ధ్వజమెత్తారు. పోలవరం టన్నల్ నిర్మాణంలో ఆరు శాతం మాత్రమే పనులు పూర్తవ్వగా 2018 కి ఎలా నీరు ఇస్తారని సూటిగా ప్రశ్నించారు.  

పోలవరం ప్రాజెక్ట్ అనుమతుల కోసం తాను ఏ విధంగా కృషి చేసానో ప్రత్తిపాడు సభలో వైఎస్ ప్రకటించిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేసారు. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించినా చిన్న వర్షాలకు కూడా అమరావతిలో నీరు కారిపోవడం సిగ్గు చేటన్నారు. ఏదైనా అంశంపై మాట్లాడాలంటే సబ్జెక్టుతో రావాలని కానీ బుచ్చయ్యచౌదరి లాగ రాజకీయాలు మాట్లాడకూడదని హితవు పలికారు. చంద్రబాబు పాలన ఇదే విధంగా ఉంటే తాను ప్రధానమంత్రి మోడీని కలుసి ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించటం గమనార్హం.

click me!