Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రసాదంలో ఎముక

By Mahesh K  |  First Published Feb 9, 2024, 9:59 PM IST

శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రసాదంలో ఎముక వచ్చింది. పులిహోర ప్రసాదంలో వచ్చిన ఎముకను చూసి భక్తుడు ఖంగుతిన్నాడు. ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేశాడు.
 


Srisailam: శ్రీశైలం శైవక్షేత్రంలో అపచారం జరిగింది. ఓ భక్తుడు తీసుకున్న పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక గల బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాద పంపిణీ జరిగింది. ఇక్కడే భక్తుడు హరీశ్ రెడ్డి ప్రసాదం తీసుకున్నారు. అయితే.. ఆయన తీసుకున్న పులిహోర ప్రసాదాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎందుకంటే ఆ ప్రసాదంలో ఓ ఎముక వచ్చింది.

దీంతో ఆయన ఆ ఎముక ముక్కను అలాగే తీసుకెళ్లి ఆధారాలతో సహా ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం భక్తుల్లో తీవ్ర అసహనాన్ని కలిగించింది. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని అధికారులు, సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తపరిచారు. 

Latest Videos

Also Read: నేపాల్‌లో చిక్కిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్!

ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

click me!